Header Banner

తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు ఇలా మోసపోకండి! అలాంటి వారితో జాగ్రత్త!

  Sun Feb 23, 2025 07:00        Devotional

తిరుమల కొండ కింద కొత్త దందా నడుస్తోంది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రైవేటు ట్యాక్సీలు, ఆటోవాలాలు కొత్త దందాకు తెరతీశారు. శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. బస్సులు, రైళ్లలో తిరుపతికి చేరుకునే భక్తులకు కొంతమంది ఆటోవాలాలు టైమ్‌ స్లాట్‌ టోకెన్లు ఇప్పిస్తామంటూ నమ్మిస్తున్నారు. ఇందుకోసం ఒక్కో భక్తుడి నుంచి రూ.500 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌, బస్టాండు, శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద భక్తులకు మాయమాటలు చెబుతున్న ఆటోవాలాలు.. తిరుపతిలో టైమ్‌ స్లాట్‌ టోకెన్లు పొందాలంటే కష్టమని.. తమతో వస్తే శ్రీవారిమెట్టు వద్ద క్షణాల్లో దర్శన టోకెన్లు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు.

 

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

భక్తులు అది నమ్మి ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తూ శ్రీవారిమెట్టు దగ్గరకు చేరుకుంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన వెళ్లే భక్తులకు రోజుకు 3 వేలు టోకెన్లు మాత్రమే ఇస్తున్నారు. అక్కడకు వెళ్లిన భక్తులు టోకెన్లు అయిపోవడంతో ఉసూరుమంటున్నారు. ఒక్కో ఆటో డ్రైవర్ భక్తుల బృందం నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో శ్రీవారిమెట్టు మార్గం వద్దకు భక్తులు భారీగా వస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Devotional #Tirumala #TTD #Tirupati